Saamna : శివసేన యూబీటీ పార్టీ మౌత్ పీస్ సామ్నా(Saamna) కీలక వ్యాఖ్యలు చేసింది. తాజా సంచికలో సంపాదకీయంలో సంచలన ఆరోపణలు చేసింది. ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొంది. ఆ గ్రూప్ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత స్పీడ్ గా బయటకు రావాలని అనుకుంటున్నట్లు తెలిపింది. భారతీయ జనతా పార్టీ పొమ్మనకుండా పొగ పెడుతోందని ఆరోపించింది. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా బయటకు నెట్ట బడతారనేది త్వరలోనే తేలుతుందని స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీకి కేవలం పవర్ కావాలి. అంతే తప్పా విలువలు, సిద్దాంతాలు అంటూ ఏవీ ఉండవని పేర్కొంది. గతంలో తమతో కూడా ఇలాగే వ్యవహరించిందని, రేపు షిండేను వాడుకుని వదిలి వేయడం ఖాయమని జోష్యం చెప్పింది సామ్నా సంపాదకీయం. ఠాక్రేలకు ద్రోహం చేసి బీజేపీతో చేతులు కలిపిన సేన ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి ప్రేమ వ్యవహారం తారు మారైందన్నారు.
విడాకుల చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది సామ్నా సంపాదకీయం. ఈ విషయాన్ని వారాంతంలో శివసేన తిరుగుబాటు ఎంపీ గజానన్ కీర్తికర్ లేవనెత్తారు. తన పార్టీ పట్ల బీజేపీ సవతి తల్లి పాత్ర పోషిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిని ఆధారంగా చేసుకున్ని సంపాదకీయం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సామ్నా ఎడిటోరియల్ కలకలం రేపుతోంది.
Also Read : Kapurthala Rail Factory