Sachin : కరోనాతో కన్ను మూసిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించాడు భారత జట్టు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin ).
ఆయనతో పాటు సతీమణి కూడా నివాళులు అర్పించారు. లతా మంగేష్కర్ భౌతిక కాయంపై పుష్ప గుచ్ఛం ఉంచి కన్నీటి పర్యంతం అయ్యాడు. ముంబై లోని శివాజీ పార్కులో లతా అంతిమ సంస్కార సమయంలో కంట తడి పెట్టాడు.
అనంతరం ట్విట్టర్ వేదికగా సచిన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు. లతా మంగేష్కర్ తనకు అమ్మ లాంటి వారు. ఆమె నాకు లభించడం గర్వంగా ఉంది. లతాజీతో కొంత కాలం పాటు గడిపినందుకు సంతోషంగా ఉంది.
దేవుడు ఇచ్చిన వరం. ఆమె నాకు దక్కడం. ఆమెతో గడపడం. ఏ మాత్రం సమయం ఉన్నా వెంటనే లతాజీ వద్దకు వెళ్లే వాడిని. కానీ ఇప్పుడు అమ్మ లేదు. ఆమె ఎల్లప్పుడూ నాపై అమితమైన ప్రేమ చూపించే వారు.
అంతకంటే ఎక్కువగా క్రికెట్ అంటే ఎనలేని ఇష్టం లతాజీకి. ఆమె భౌతికంగా లేక పోవడం నాకు ఎనలేని లోటు అని పేర్కొన్నాడు టెండూల్కర్(Sachin ). తన గాత్రంతో ఎల్లప్పుడూ మనందరి హృదయాల్లో బతికే ఉంటుందని స్పష్టం చేశాడు.
తనను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. హృదయం శూన్యంగా మారి పోయింది. నేను పలకరించేందుకు ఇక అమ్మ జీవించి లేకుండా పోవడం బాధా కరమని పేర్కొన్నాడు.
సాయంత్రం శివాజీ పార్కులో జరిగిన లతాజీ అంత్యక్రియల్లో ప్రధాని మోదీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Also Read : ఆసిస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ గుడ్ బై