Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య !
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య !
Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడటంస్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో కలకలం రేపింది. మహారాష్ట్రలోని జామ్నర్ పీఎస్ సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కిరణ్ షిండే తెలిపిన వివరాల ప్రకారం… జామ్నర్ కి చెందిన ప్రకాశ్ కప్డే(39) సచిన్ టెండూల్కర్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో సెక్యూరిటీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇటీవలే విధులకు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. బుధవారం ఉదయం 1.30 సమయంలో ఆయన తన వద్ద ఉన్న సర్వీస్ గన్ తో మెడపై కాల్చుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రకాశ్ అప్పటికే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.
Sachin Tendulkar…
ప్రకాశ్ ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శవగారానికి తరలించారు. సూసైడ్‌కి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రకాశ్ తల్లిదండ్రులు, భార్య పిల్లలు, సన్నిహితులు, స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. వీవీఐపీ సెక్యూరిటీ సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్ఆర్పీఎఫ్ సైతం స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోంది.
Also Read : EC : ఏపీలో ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ తగ్గిందంటున్న ఈసీ