Saeeda Khan : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ఆయన సహాయకుల కార్యకలాపాలతో అంటకాగి ఉన్నారంటూ మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడంటూ ఈడీ మరాఠా మంత్రి నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసింది.
ఆయనను ఇంటి నుంచి బలవంతంగా ఆఫీసుకు తీసుకు వెళ్లింది. దాదాపు ఎనిమిది గంటలకు పైగా విచారణ చేపట్టింది. ఆ తర్వాత నవాబ్ మాలిక్ ను ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది.
దీంతో నిన్న మహారాష్ట్ర సర్కార్ అత్యవసర సమావేశం నిర్వహించింది. తనను అరెస్ట్ చేయడంతో నవాబ్ మాలిక్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించ లేదని శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
ఈ తరుణంలో మంత్రి మాలిక్ చెల్లెలు బీజేపీపై, మోదీ సర్కార్ పై తీవ్రంగా మండి పడింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా అదుపు తప్పింది. తన అధికార పరిమితులను దాటింది. మాలిక్ ను బలవంతంగా తీసుకు వెళ్లింది.
ఎలాంటి ప్రోటోకాల్ పాటించిన దాఖలాలు లేవు. ఇది పూర్తిగా ప్రతీకారంతో జరిగిందని ఆరోపించింది. బీజేపీ కేంద్రంలోని ప్రతిపక్షాలను చూసి తట్టుకోలే పోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కుటుంబ వైద్యురాలైన సయీదా ఖాన్(Saeeda Khan).
కాగా అంతకు ముందు జేజే ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. మా అన్నయ్య, మంత్రి అయిన మాలిక్ నాకు ధైర్యం చెప్పారు. నాకు ఏమీ కాదన్నారు. బీజేపీ కావాలని చేసిన కుట్రగా పేర్కొన్నారు. తన సోదరుడు నిర్దోషిగా బయటకు వస్తాడని తెలిపింది.
Also Read : అమిత్ షా కామెంట్స్ కు మాయావతి ఫిదా