Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో సైఫ్ పై దాడికి ప్రయత్నించిన నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులకు… దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ కేసులో అదుపులోనికి తీసుకున్న నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ ఫింగర్ ప్రింట్స్… దాడి జరిగిన స్థలంలో సేకరించిన 20 ఫింగర్ ప్రింట్స్ తో కూడా మ్యాచ్ అవ్వలేదని సమచారం. నిందితుడి ఫింగర్ ప్రింట్స్… సంఘటనా స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ వేరు కావడంతో ఇప్పుడు పోలీసులు, విచారణ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే అసలు నిందితుడు ఎవ్వరనేదానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.
ఈ ఏడాది జనవరి 15 వ తేదీన సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై ఆయన ఇంట్లోనే కత్తి దాడి జరిగింది. దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ముంబై పోలీసులు బాంద్రాలోని ఆయన ఇంటికి వెళ్లారు. క్లూస్ టీం అక్కడ 20 సెట్ల ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది. ఆ ఫింగర్ ప్రింట్స్ అనాలసిస్ కోసం సీఐడీ దగ్గరకు వెళ్లాయి. ఆ 20 సెట్లతో… సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అదుపులోకి తీసుకున్న నిందితుడు షరీఫుల్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. టెస్ట్ రిపోర్టులు నెగిటివ్ వచ్చిన విషయాన్ని సీఐడీ… ముంబై పోలీసులకు తెలిపింది. మరిన్ని ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ పంపితే.. వాటిని కూడా పరీక్షిస్తామని పేర్కొంది.
Saif Ali Khan – ఛార్జ్‌షీటులో వెలుగులోకి వచ్చిన అసలు విషయాలు
ముంబై పోలీసులు సైఫ్ అలీఖాన్ కేసుకు సంబంధించి తాజాగా 1600 పేజీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో ఫింగర్ ప్రింట్లకు సంబంధించిన విషయాలు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఛార్జ్ షీటులో ముఖం, వేలి ముద్రలు, ఐడెంటిఫికేషన్ పెరేడ్, ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధనలకు సంబంధించిన విషయాలు కూడా అందులో ఉన్నాయి. ఈ చార్జ్ షీట్ లోనే ఈ ఫింగర్ ప్రింట్స్ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : Robert Vadra: మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా