Sailajanath : బాబు అరెస్ట్ బాధాకరం
ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్
Sailajanath : ఆంధ్రప్రదేశ్ – ఏపీసీసీ మాజీ చీఫ్ , మాజీ మంత్రి సాకె శైలజానాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో కావాలని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదన్నారు.
Sailajanath Feel Painful for Babu’s Arrest
చంద్రబాబు అరెస్ట్ విషయం కేంద్రంలోని బీజేపీకి తెలియకుండా జరిగిందంటే నమ్మలేమన్నారు. ఇదంతా పక్కా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం తనను అదుపులోకి తీసుకున్నారంటూ మండిపడ్డారు. ఏదో రకంగా ఏపీలో అల్లకల్లోలం సృష్టించేందుకే ఇలా చేశారంటూ వ్యాఖ్యానించారు శైలజానాథ్(Sailajanath).
కనీసం వయసు రీత్యా చంద్రబాబును విడిచి ఉండాల్సిందన్నారు. కానీ ఏపీ సర్కార్ కావాలని చేస్తోందన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. మాజీ సీఎంను కావాలని అరెస్ట్ చేశారంటూ ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే 40 రోజులకు పైగా అయ్యింది అరెస్ట్ అయ్యి. ఏపీ స్కిల్ స్కాంలో రూ. 371 కోట్లు చేతులు మారాయంటూ ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది ఏపీ సిఐడీ. అంతే కాదు ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో కూడా ఇరికించింది. ఈ మేరకు ఏసీబీ కోర్టుకు రిపోర్టు ఇచ్చింది.
Also Read : AP CM YS Jagan : పోలీసు అమరులకు వందనం