Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు

Sajjala Ramakrishna Reddy : వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ లో రాజధాని దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

Sajjala Ramakrishna Reddy Criminal Case

నిరసన వ్యక్తం చేసిన వారు సంకరజాతి వారని సజ్జల చేసిన వ్యాఖ్యలపై శిరీష ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. అయితే సజ్జలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు వీలు లేదని హైకోర్ట్‌లో శిరీష తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఈ రోజు ఉదయం కేసు రిజిస్టర్ కావడంతో పోలీసుల చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read : Balakrishna: బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బాలయ్య కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!