Sajjala Ramakrishna Reddy: రాజధానిపై సజ్జల యూ టర్న్

రాజధానిపై సజ్జల యూ టర్న్

Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. వైసీపీ హాయాంలో మూడు రాజధానులు అంటూ హడావుడి చేసిన సజ్జల (Sajjala Ramakrishna Reddy)… చిరవకు అమరావతి ఏకైక రాజధాని అంటూ మాట మార్చారు. రాజధాని ఏర్పాటుకు విజయవాడ- గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందని సజ్జల స్పష్టం చేసారు. మచిలీపట్నం వరకు మెగా సిటీ అవుతుందని పేర్కొన్నారు. అమరావతిలో ఉన్న భవనాలు చాలు… కొత్తవి అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపొద్దని సూచించారు.

Sajjala Ramakrishna Reddy Shocking Comments

వైసీపీ హయాంలో అమరావతిని తీసేస్తామని తాము చెప్పలేదని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారంటూ మాటమార్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాత్రమే చెప్పామని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు అనుకున్నామని సజ్జల వివరించారు.

‘చంద్రబాబు మళ్లీ ల్యాండ్‌ పూలింగ్‌ అంటున్నారు’ – సజ్జల

వైసీపీ ఎప్పుడూ విజన్‌తోనే ఆలోచిస్తుందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము నేరుగా లబ్ధిదారుడికే పథకాలు అందించామని, 2029 వరకూ అధికారంలో ఉండి ఉంటే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందేదన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సజ్జల… ప్రజల ఆకాంక్షల మేరకు తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు.

‘ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేది. బాబు తన జేబు, తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారు. అమరావతిలో లక్షల కోట్లు రూపాయలు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదు. అమరావతిలో రాజధాని అంటే స్టేట్‌ను ఊబిలో దింపడమే. బాబు సెన్స్‌బుల్‌గా ఆలోచించి అప్పులు పాలు కాకుండా చూడాలి. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ల్యాండ్‌ పూలింగ్‌ అంటున్నారు. చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ అంటుంటే అనుమానాలు వస్తున్నాయి. మేం వచ్చేలోపు బాబు అప్పులు పాలు చేయకుండా ఉంటే చాలు’ అని తెలిపారు.

Also Read : Ganta Srinivasarao: జగన్‌ మానసిక పరిస్థితిపై అనుమానం ఉంది – గంటా శ్రీనివాసరావు

Leave A Reply

Your Email Id will not be published!