Saleshwaram Jatara : సలేశ్వరం జాతర ప్రారంభం
లింగమయ్య కోసం భక్తజనం
Saleshwaram Jatara : నల్లమలలో కొలువు తీరిన లింగమయ్య సలేశ్వరం జాతర ఘనంగా ప్రారంభమైంది. భారీ ఎత్తున భక్తులు లింగమయ్య దర్శనం కోసం బారులు తీరారు. ప్రకృతి నీడలో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సలేశ్వరం(Saleshwaram Jatara). చుట్టూ అడవి, కొండలు, గుట్టల మధ్య చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇక్కడ చెంచులే పూజారులుగా ఉన్నారు.
దక్షిణాదిన అమర్ నాథ్ యాత్రగా సలేశ్వరం లింగమయ్య జాతర వినుతికెక్కింది. ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ దాకా కొనసాగుతుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది.
పున్నమి వెన్నెల సమయంలో కుల దైవాన్ని దర్శించుకునేందుకు పోటీ పడతారు భక్తులు. రాళ్లు, రప్పలను దాటుకుంటూ 4 కిలోమీటర్ల మేర లింగమయ్యను దర్శించు కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నడక ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తారు.
ఉగాది తర్వాత తొలి పౌర్ణమికి ఈ జాతర మొదలవుతుంది. ఇది అనాది నుంచి కొనసాగుతూ వస్తోంది. ఎండాకాలం కావడంతో దాతలు లింగమయ్య (శివుడు) దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచితంగా అన్నదానం, చలి వేంద్రాలు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం నాగర్ కర్నూల్ , అచ్చంపేట, కొల్లాపూర్ , కల్వకుర్తి, తదితర డిపోల నుంచి బస్సులను ఏర్పాటు చేశారు.
Also Read : బాబూ జగ్జీవన్ రామ్ కు దేశం సలాం