Salman Butt : బాబర్ ఆజంపై సల్మాన్ భట్ కన్నెర్ర
అత్యంత చెత్త షాట్ ఆడాడంటూ ఫైర్
Salman Butt : యూఏఈ వేదికగా ఆసియా కప్ -2022 ఫైనల్ జరగనుంది. కీలక పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుస విజయాలతో ఫైనల్ కు చేరింది శ్రీలంక.
టోర్నీ కంటే ముందు ఆ జట్టు అండర్ డాగ్స్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ బలమైన టైటిల్ హాట్ ఫేవరేట్స్ గా పేర్కొంటూ వచ్చిన భారత్, పాకిస్తాన్ జట్లను మట్టి కరిపించింది.
ఒక రకంగా చుక్కలు చూపించింది. అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. ఈ తరుణంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) ఆడిన తీరు దారుణంగా ఉందంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్(Salman Butt).
అత్యంత చెత్త షాట్ ఆడాడని, లేక పోయి ఉండి ఉంటే భారీ స్కోర్ జట్టు చేసి ఉండేదన్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ను శ్రీలంక 121 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం శ్రీలంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
షనక సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ బ్యాటర్ గా పేరొందిన ఆజం ఇలాంటి పేలవమైన షాట్ ఆడతాడని తాను అనుకోలేదన్నాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఒక కెప్టెన్ మరింత జాగ్రత్తగా ఆడాలి. కానీ పాక్ కెప్టెన్ అలాంటిది ఏమీ పట్టంచు కోలేదు.
పైకి వచ్చిన బంతిని పుష్ చేయకుండా ఉండి ఉంటే బావుండేది. కానీ అనవసరమైన షాట్ కోసం వెళ్లి వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు సల్మాన్ భట్.
ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కంటే శ్రీలంక అద్బుతమైన ఆట తీరును ప్రదర్శించిందని మాజీ కెప్టెన్(Salman Butt) పేర్కొన్నాడు. ప్రశంసలతో ముంచెత్తాడు.
Also Read : తుది సమరానికి పాకిస్తాన్ శ్రీలంక సై