Salman Khan Threat : నెలాఖరు లోగా సల్మాన్ ను లేపేస్తాం
బాలీవుడ్ నటుడికి డెడ్ లైన్
Salman Khan Threat : బాలీవుడ్ కండల వీరుడిగా పేరొందిన నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఈసారి ఏకంగా ముంబై పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి డెడ్ లైన్ విధించడం కలకలం రేపింది.
ఇప్పటికే జింకను చంపిన కేసులో గ్యాంగ్ స్టర్ నుంచి సల్మాన్ ఖాన్ పలుమార్లు బెదిరింపులకు గురయ్యాడు. ఆయన లేఖ కూడా అందుకున్నారు. దాని ఆధారంగా ముంబై పోలీస్ స్టేషన్ లో తన తండ్రితో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ కు భద్రత(Salman Khan Threat) మరింత పెంచారు.
తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ ను చంపుతామంటూ కాల్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఏకంగా తేదీ కూడా ప్రకటిచంచడం విశేషం. ఏప్రిల్ 30 అంటే ఈ నెలాఖరులోగా లేపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో సల్మాన్ ఖాన్ మరింత అప్రమత్తం అయ్యారు. తాజాగా ఆయన వెంకటేశ్, పూజా హెగ్డేతో కలిసి నటించిన మూవీ రానుంది. ఇదిలా ఉండగా ఈ బెదిరింపు కాల్ ఏప్రిల్ 10న వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
తనను తాను రాఖీ భాయ్ గా పరిచయం చేసుకున్నట్లు సమాచారం. కంట్రోల్ రూంకు వచ్చిన కాల్ పై విచారణ చేపట్టారు. ఇందులో నిజం ఉందా లేక ప్రాంక్ కాల్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ మేరకు రాజస్థాన్ పోలీసులను అలర్ట్ చేశారు ముంబై పోలీస్.
Also Read : 2024 ఎన్నికల్లో 300 సీట్లు పక్కా – షా