Salman Rushdie : స‌ల్మాన్ ర‌ష్డీపై దాడి ప‌రిస్థితి విష‌మం

వెంటిలేట‌ర్ పై ప్ర‌పంచ ర‌చ‌యిత

Salman Rushdie : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన స‌ల్మాన్ ర‌ష్డీపై దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఇస్లాంకు , మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌కు వ్య‌తిరేకంగా ర‌చ‌న‌లు చేస్తూ వ‌స్తున్నారు.

ముస్లింల ఆగ్ర‌హానికి గుర‌వుతూ వ‌స్తున్నారు. చేతిలో న‌రాలు, మెడ‌పై, క‌డుపులో క‌త్తి పోట్ల‌కు గుర‌య్యాడు. స‌ల్మాన్ ర‌ష్డీని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

త‌న ర‌చ‌న‌ల కారణంగా ఆయ‌న తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొన్నాడు. ఇరాన్ స‌ల్మాన్ ర‌ష్డీ(Salman Rushdie) ప్రాణానాకి వెల క‌ట్టింది. ఆయ‌న ఎక్క‌డున్నా చంపాల‌ని పిలుపునిచ్చింది.

దీంతో కొన్ని సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి స‌ల్మాన్ ర‌ష్డీ అజ్ఞాతంలో ఉన్నారు. భార‌త సంత‌తికి చెందిన న‌వాల ర‌చ‌యిత. న్యూయార్క్ రాష్ట్రంలో ఆయ‌న ప్ర‌సంగించేందుకు వ‌చ్చారు.

వేదిక‌పై ఉండ‌గా అంద‌రూ చూస్తుండ‌గానే ఓ దుండగుడు వ‌చ్చి దాడికి పాల్ప‌డ్డాడు. మెడ‌, మొండెంపై క‌త్తితో పొడిచాడు. అచేత‌నంగా ప‌డి ఉన్న స‌ల్మాన్ ర‌ష్డీని అక్కడున్న వారు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

శ‌స్త్ర చికిత్స అనంత‌రం ర‌ష్డీని వెంటిలేట‌ర్ పై ఉంచారు. ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వ‌లా ర‌చ‌యిత స‌ల్మాన్ ర‌ష్డీపై జ‌రిగిన దాడిని ర‌చ‌యిత‌లు, క‌వులు, క‌ళాకారులు, మేధావులు తీవ్రంగా ఖండించారు.

ఆయ‌న ఒక క‌న్ను కోల్పోవ‌చ్చు. అత‌ని చేతి న‌రాలు దెబ్బ‌తిన్నాయి. కాలేయం క‌త్తి పోటు కార‌ణంగా దెబ్బ‌తింది అని ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ న్యూయార్క్ లోని చౌటౌక్వా ఇనిస్టిట్యూష‌న్ లో జ‌రిగిన క‌ళాత్మ‌క స్వేచ్ఛ‌పై ప్ర‌సంగించేందుకు వ‌చ్చారు.

ఆయ‌న‌కు 75 ఏళ్లు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. న్యూజెర్సీ లోని పెయిర్ వ్యూకు చెందిన 24 ఏళ్ల వ్య‌క్తి హ‌దీ మ‌ట‌ర్ గా పోలీసులు గుర్తించారు.

Also Read : కార్పొరేట్ల‌కు అంద‌లం ప‌థ‌కాల‌కు మంగ‌ళం

Leave A Reply

Your Email Id will not be published!