Samatha Kumbh 2023 : వైభ‌వోపేతం క‌ళ్యాణోత్స‌వం

భ‌క్త జ‌న‌సందోహం దివ్య సాకేతం

Samatha Kumbh 2023 : శంషాబాద్ ముచ్చింత‌ల్ లోని దివ్య సాకేతం భ‌క్తుల‌తో నిండి పోయింది. ప్ర‌తి చోటా జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ మూల మంత్రం వినిపిస్తోంది. భ‌క్తులు పార‌వ‌శ్యంతో మునిగి పోయారు. క‌లియుగంలో భ‌క్త బాంధ‌వుడిగా వినుతికెక్కిన శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి వారి ఆశీస్సుల కోసం , తీర్థ,ప్ర‌సాదం కోసం బారులు తీరారు.

స‌మ‌స్త లోకం బాగుండాల‌ని కోరుతూ చిన్న‌జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో సాకేత్ కుంభ్ -2023 ఉత్స‌వాల‌ను(Samatha Kumbh 2023) నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి 2 నుంచి మొద‌లైన ఈ ఉత్స‌వాలు వ‌రుస‌గా 14 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. పూజ‌లు , కైంక‌ర్యాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

ప్ర‌తి రోజూ విశిష్ట‌మైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఇక ఫిబ్ర‌వ‌రి 8న బుధ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు కళ్యాణోత్స‌వంతో పాటు సామూహిక పుష్పార్చ‌న ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు భ‌గ‌వ‌ద్గీత‌లో సూప‌ర్ మెమోరీ టెస్టు చేప‌ట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంట‌ల‌కు తెప్పోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా చేప‌ట్టారు.

9న గురువారం ఉద‌యం 108 దివ్య దేశాల స‌మ‌ర్ప‌ణ కార్య‌క్రమం ఉంటుంది. సాయంత్రం 5.00 నుంచి 5.45 శ్రీ విష్ణు స‌హ‌స్ర పారాయ‌ణం నిర‌ర్వ‌హిస్తారు. 5 గంట‌ల‌కు ప్ర‌త్యేక వేదిక‌పై సామూహిక ఉప‌న‌య‌న కార్య‌క్ర‌మం ఉంటుంది. 6.00 నుంచి రాత్రి 8.30 గంట‌ల‌కు గ‌రుడ సేవ‌లు ఉంటాయి. అనంత‌రం తీర్థ ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రుగుతుంది.

10న శుక్ర‌వారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌త్యేక వేదికపై సామూహిక ఉప‌న‌య‌న కార్య‌క్ర‌మం ఉంటుంది. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంట‌ల‌కు గ‌జ వాహ‌న సేవ‌, 18 గ‌రుడ సేవ‌లు నిర్వ‌హిస్తారు.

11న శ‌నివ‌రం ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌థోత్స‌వం , నిత్య పూర్ణ హార‌తి , చ‌క్ర స్నానం ఉంటుంది. మ‌ధ్యాహ్నం విశ్వ శాంతి కోసం గీతా పారాయ‌ణం చేప‌డ‌తారు.

Also Read : బ్ర‌హ్మోత్స‌వాల‌కు ‘మ‌ల్ల‌న్న‌’ సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!