Samatha Kumbh 2023 : 11న విశ్వ శాంతి గీతా పారాయణం
చిన్నజీయర్ ఆధ్వర్యంలో తరించండి
Samatha Kumbh 2023 : జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శంషాబాద్ లోని ముచ్చింతల్ లో కొలువు తీరిన దివ్య సాకేతంలో సమతా కుంభ్ 2023 ఉత్సవాలు(Samatha Kumbh 2023) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 11న కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీ స్వామి వారు. లోక కళ్యాణం కోసం విశ్వ శాంతి కోసం విరాట్ గీతా పారాయణం కొనసాగుతుంది.
శనివారం సమతా మూర్తి స్పూర్తి కేంద్రంలో (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఈ అద్భుత కార్యక్రమం కొనసాగుతుంది శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రత్యేక పర్యవేణలో జరగనుంది. ఇప్పటికే పుణ్య క్షేత్రంలో ఏర్పాట్లు చేశారు.
సకల లోక గురుడికి, సర్వ వేదక విదుడికి..వేదాంత వీధి విహారికి, బ్రహ్మ విద్యా ప్రదాతికి , అర్జున సారథికి ..వినయంతో, విశ్వాసంతో , కృతజ్ఞతతో సమర్పించే విశ్వ శాంతి విరాట్ గీతా పారాయణం నిర్వహించనున్నారు.
కనీ వినీ ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో సామూహిక భగవద్ గీతా పారాయణం కొనసాగనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి , ఇతర దేశాల నుంచి భక్త బాంధవులు చేరుకుంటున్నారు దివ్య సాకేతంకు.
సమస్త సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించి, జీవితాలను సుఖమయం చేసుకొనే గొప్ప వరం ఈ అరుదైన కార్యక్రమం గీతా పారాయణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..జీవితాన్నిసాఫాల్యం చేసుకోండి..జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి కృపకు పాత్రులు కండి. ఇదిలా ఉండగా సమతా కుంభ్(Samatha Kumbh 2023) ఉత్సవాలు ఈనెల 14 వరకు కొనసాగనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం రండి తరించండి.
Also Read : దివ్య సాకేతంలో కళ్యాణోత్సవం