Danish Kaneria : శాంసన్ అద్భుతం బీసీసీఐ తీరు దారుణం
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా
Danish Kaneria : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన కామెంట్స్ చేశాడు. రాణించక పోయినా రిషబ్ పంత్ ను జట్టులో కొనసాగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత 11 ఇన్నింగ్స్ లు ఆడితే 10 ఇన్నింగ్స్ లలో అత్యంత దారుణంగా విఫలం అయ్యాడని, అతడిని ఎలా కంటిన్యూ చేస్తారంటూ ధ్వజమెత్తాడు.
తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించాడు కనేరియా. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అతడు గనుక తమ దేశంలో గనుక ఉండి వుంటే ఈపాటికీ ఇంటర్నేషనల్ స్టార్ గా మారి ఉండేవాడని కితాబు ఇచ్చాడు. అతడి ట్రాక్ రికార్డు బాగానే ఉన్నా ఎందుకని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు డానిష్ కనేరియా(Danish Kaneria).
ఎవరైనా , ఏ దేశ క్రీడా సంస్థ అయినా రాణించే వాళ్లను, ప్రతిభ కనబర్చే ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటుందని కానీ దీనికి భిన్నంగా బీసీసీఐ వ్యవహరిస్తోదంంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూ శాంసన్ ను తప్పక ఆడాంచాల్సి ఉన్నా రాజకీయాల కారణంగానే అతడిని పూర్తిగా పక్కన పెట్టారంటూ వాపోయాడు డానిష్ కనేరియా.
అంతే కాకుండా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పై కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. రిషబ్ పంత్ వైట్ బాల్ క్రికెటర్ కాదన్నాడు. కానీ ఈ ఫార్మాట్ లో అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా సంజూ శాంసన్ కు ఉందని స్పష్టం చేశాడు. ఇకనైనా బీసీసీఐ రాజకీయాలు పక్కన పెట్టి కేరళ స్టార్ కు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని సూచించాడు డానిష్ కనేరియా(Danish Kaneria).
Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబర్..హక్ టాప్