#SanjanaReddy : సంజనా రెడ్డి సిసలైన గెలుపు కథ
లక్షల పెట్టుబడి కోట్లల్లో రాబడి
Sanjana Reddy : సినిమా అన్నది అదో జూదం లాంటిదేనన్న నానుడి తప్పు అని నిరూపించింది ఓ చిన్న సినిమా. చాప కింద నీరులా అది సాధించిన సక్సెస్..ఇదే రంగంలో కొన్నేళ్లుగా గెలుపు కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి కనువిప్పు కావాలి. సంజనా రెడ్డి ఈ పేరు ఎక్కువగా ఎప్పుడూ ఎక్కడా వినిపించలేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఆమెను సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ జాబితాలో చేరేలా చేసింది.
ఆమె దర్శకత్వం వహించిన సినిమా రాజు గాడు. రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్ర ప్రసాద్ తారాగణంతో ఈ మూవీని రిలీజ్ చేశారు. సుంకర రామబ్రహ్మం నిర్మించారు. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇందులోని ఒకే ఒక్క పాట మోస్ట్ పాపులర్ సాంగ్ గా ఆల్ టైమ్ సాంగ్స్ లలో టాప్ రేంజ్ లో నిలిచింది.
ఆ పాటను రామజోగయ్య శాంత్రి రాస్తే హేమచంద్ర పాడారు. చాలా ఈజీగా లలితమైన పదాలను ఇందులో వాడారు. అంతే అలవోకగా ఆలపించారు సింగర్. రబ్బరు బుగ్గల రామ్ చిలక రయ్యంటూ కాదనకా అంటూ సాగిన ఈ సాంగ్ ను ఏకంగా 5 లక్షల మంది చూశారు. ట్యూన్ క్యాచీగా ఆకట్టుకునేలా ఉండటంతో పాటు యూత్ ను బాగా కనెక్ట్ అయ్యేలా తీయడంతో మరింత పాపులర్ అయ్యింది.
ఒక రకంగా చెప్పాలంటే ఇదో సంచలన విజయమని చెప్పాలి. నిర్మాత సంజనా రెడ్డిపై నమ్మకంతో తీసిన ఈ సినిమా మొత్తం కామెడీని పండించింది. అదే సమయంలో స్క్రీన్ ప్లే కూడా దీనికి తోడయ్యింది. ఇక్కడ సక్సెస్ కావడంతో హిందీలో సాజిద్ నాడియావాలా ఈ మూవీని రీమేక్ చేశారు.
అక్కడ కార్తీక్ ఆర్యన్ , అమర్యా దస్తూర్ నటించారు. మొత్తం అయిదు పాటలు ఇందులో వుంటే నాలుగు పాటలను రామజోగయ్య రాస్తే మరో పాటను భాస్కరభట్ల రాశారు. ఈ ఒక్క పాటకు కొరియోగ్రఫీ కూడా అదుర్స్ అనేలా డైరెక్టర్ సంజనా రెడ్డి (Sanjana Reddy ) తీశారు. మొదటిసారి తీసిన సినిమా భారీ సక్సెస్ ను మూటగట్టు కోవడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
పెట్టుబడి 50 లక్షలు పెడితే కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా . మొత్తం మీద సంజనా రెడ్డి(Sanjana Reddy )కెరీర్ లో ఇదో మరిచి పోలేని సినిమా గా మిగిలి పోతుంది. మ్యాథ్స్ టీచర్ గా, సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేయారు. అనుకోకుండా ఆమెకు సినిమాల మీదున్న అభిమానం డైరెక్టర్ గా మార్చేడింది. అంతకు ముందు రామ్ గోపాల్ వర్మ వద్ద రౌడీ సినిమాకు పని చేసారు.
తమ మీద తమకు నమ్మకం వుండి కంటెంట్ బలంగా ఉంటే మాత్రం ఏ మూవీ అయినా జనం ఆదరిస్తారు అనే దానికి ఇదో ఉదాహరణ మాత్రమే. హీరో ఓరియెంటెడ్ సినిమాలను జనం పట్టించు కోవడం లేదు. జస్ట్ కథ నచ్చితే చాలు ఎంచక్కా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.
సో కథలో దమ్ముంటే సక్సెస్ అదంతకు అదే వరిస్తుందన్న మాట. వీలైతే సినిమా తీయక పోయినా పర్వాలేదు. టాలెంట్ ఉంటే చాలు యూట్యూబ్ ఉందిగా దుమ్ము రేపేందుకు. ఇంకెందుకు ఆలస్యం. రెడీ అయిపోండి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.
No comment allowed please