Sanjay Raut : రాహుల్ పై కేంద్రం క‌క్ష రౌత్ క‌న్నెర్ర‌

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన శివ‌సేన ఎంపీ

Sanjay Raut : గుజ‌రాత్ కోర్టు స్టే ఇవ్వ‌కుండా రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్ట‌డం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శుక్ర‌వారం శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి , రాజ్య స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ నేష‌న‌ల్ చీఫ్ జేపీ న‌డ్డా కావాల‌ని క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

దేశంలో రోజు రోజుకు మోదీ హ‌వా త‌గ్గుతోంద‌ని, ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసే పనిలో కీల‌కంగా రాహుల్ గాంధీ మారార‌ని ఆయ‌న‌ను డీమోర‌లైజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. కావాల‌ని కేంద్రం రాహుల్ గాను ల‌క్ష్యంగా చేసుకుంద‌న్నారు.

ఏఐసీసీ మాజీ చీఫ్ పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని , ఆయ‌న ఎక్క‌డ ఎవ‌రిని ఉద్దేశించి ఏం మాట్లాడార‌నేది ఇప్ప‌టి దాకా చెప్ప‌లేక పోయింద‌న్నారు సంజ‌య్ రౌత్(Sanjay Raut). క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం కేసులో గాంధీని దోషిగా నిర్దారిస్తూ సెష‌న్స్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజ‌రాత్ హైకోర్టు స‌మ‌ర్పించిన కొన్ని గంట‌ల త‌ర్వాత రౌత్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ వెళ‌తార‌ని, అక్క‌డ ఆయ‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు చెప్పారు శివ‌సేన ఎంపీ. కేంద్రం కుట్ర‌లు అబ‌ద్ద‌మ‌న్నారు.

Also Read : Pankaja Munde : కాంగ్రెస్ లో చేర‌డం లేదు – పంక‌జా ముండే

Leave A Reply

Your Email Id will not be published!