Sanjay Raut : కేంద్ర స‌ర్కార్ పై శివ‌సేన క‌న్నెర్ర‌

నిప్పులు చెరిగిన సంజ‌య్ రౌత్

Sanjay Raut  : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. బీజేపీయేత‌ర పార్టీలు, ప్ర‌భుత్వాలు, వ్య‌క్తులు, సంస్థ‌ల‌ను టార్గెట్ చేస్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్య‌క‌లాపాల‌కు సంబంధించి మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు ద‌ర్యాప్తులో భాగంగా రాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ ను ఈడీ అరెస్ట్ చేసింది.

ఆయ‌న‌ను 8 గంట‌ల పాటు విచారించింది. ప్ర‌త్యేక కోర్టులో హాజ‌రు ప‌రిచింది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే అరెస్ట్ చేయడాన్ని సంజ‌య్ రౌత్ (Sanjay Raut )త‌ప్పు ప‌ట్టారు.

కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం జుగుస్సాక‌ర రాజ‌కీయాల‌కు తెర లేపిందంటూ సీరియ‌స్ అయ్యారు. ఇదిలా ఉండ‌గా న‌వాబ్ మాలిక్ ను వ‌చ్చే నెల మార్చి 3 వ‌ర‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ క‌స్ట‌డీకి అప్ప‌గించారు.

దేశ వ్యాప్తంగా ఇదే ధోర‌ణి కొన‌సాగుతోంద‌ని , కావాల‌ని కేంద్రం ఇలా చేస్తోందంటూ మండిప‌డ్డారు. ఎన్నిక‌ల్లో గ‌నుక బీజేపీ ఓట‌మి పాలైతే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు, గ‌వ‌ర్న‌ర్ ఆఫీసు రంగంలోకి దిగుతున్నాయంటూ సంజ‌య్ రౌత్ (Sanjay Raut )సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

బెంగాల్ లో ఏం జ‌రిగిందో చూశాం. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో న‌వాబ్ మాలిక్ ను కేబినెట్ నుంచి తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

త్వ‌ర‌లోనే మంత్రి విష‌యంలో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే నిర్ణ‌యం తీసుకుంటార‌ని అన్నారు.

Also Read : ఈ యుద్దం ప్ర‌పంచానికి ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!