Sanjay Raut : వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలం
శివసేన ఎంపీ సంజయ్ రౌత్
Sanjay Raut : శివసేన యుబీటీ ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గడ్గుకాలం ఎదురు కానుందని జోష్యం చెప్పారు. సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ అదానీదే హవా కొనసాగుతోందన్నారు. ఒక రకంగా ఎన్డీఏ సర్కార్ కాదని ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారి పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. బీజేపీ దేశంలో తను మాత్రమే ఉండాలని అనుకుంటోందన్నారు.
ఇప్పుడు ఉన్న సీట్ల కంటే బీజేపీకి 110 సీట్లు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. ఇదే సమయంలో ఎన్సీపీ నేత , మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారనే ప్రచారన్ని కొట్టి పారేశారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకంలో ఒక భాగమన్నారు సంజయ్ రౌత్. మహా వికాస్ అఘాడి బంధం బలంగా ఉందన్నారు. అబద్దపు ప్రచారాన్ని చేయడంలో కాషాయ పార్టీ రాటు తేలిందని ఎద్దేవా చేశారు.
మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ బంధాన్ని తెంచ లేరన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut). అజిత్ పవార్ స్వయంగా తనంతకు తానుగా ఎన్సీపీలోనే ఉన్నానని ప్రకటించారని పేర్కొన్నారు. తాము బలహీనంగా లేమని తెలుసు కోవాలన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పవర్ లోకి రావడం ఖాయమన్నారు. 110 అసెంబ్లీ సీట్లు , 40 ఎంపీ సీట్లు తమకు ఖాయమన్నారు శివసేన నేత.
Also Read : స్వలింగ వివాహం చట్ట బద్దం