Sanjay Raut Nadav Lapid : ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ బక్వాస్ – రౌత్
ఇజ్రాయెల్ చిత్ర నిర్మాతకు ఎంపీ మద్దతు
Sanjay Raut Nadav Lapid : గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ది కాశ్మీర్ ఫైల్స్ పై సంచలన కామెంట్స్ చేశారు ఇఫీ జ్యూరీ ప్రెసిడెంట్ , ఇజ్రాయెల్ చిత్ర నిర్మాత. ఇందులో సత్తా ఏమీ లేదని, చెప్పుకునేందుకు కూడా ఎలాంటి అంశం లేదన్నారు. అంతే కాదు కావాలని ప్రచార ఆర్భాటం కనిపిస్తోందన్నారు.
దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర వామపక్షవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు, ఆలోచనాపరులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇదిలా ఉండగా ది కాశ్మీర్ ఫైల్స్ కు సంబంధించి ఇజ్రాయెల్ నిర్మాతకు పూర్తి మద్దతు ప్రకటించారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut).
ఈ సినిమా వచ్చాక కాశ్మీర్ లో అత్యధిక హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా వల్ల సమాజానికి, దేశానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. ఆపై కాశ్మీర్ లు ఉగ్రవాదులకు మరింత టార్గెట్ గా మారారని మండిపడ్డారు సంజయ్ రౌత్. ఈ చిత్రం కారణంగా అత్యధిక సంఖ్యలో హత్యలు జరిగాయన్నారు.
పండిట్లు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు ఎంపీ. ఇంత జరిగాక మూవీ -2 తీస్తారా అంటూ ఎద్దేవా చేశారు సంజయ్ రౌత్(Sanjay Raut) . ఒక రకంగా సినిమా పేరుతో కోట్లు కొల్లగొట్టారంటూ ధ్వజమెత్తారు. మనుషుల భావోద్వేగాలతో ఆటాడు కోవడం మంచి పద్దతి కాదన్నారు.
ఇది ఒక సినిమానే కాదని దానిని బీజేపీ కావాలని ప్రమోట్ చేసిందన్నారను సంజయ్ రౌత్.
Also Read : అవాస్తవాలని తేలితే తప్పుకుంటా – వివేక్