Sanjay Raut Custody : నాలుగు రోజుల ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్
రాజకీయ వైరం వల్లే అరెస్ట్ చేశారన్న ఎంపీ
Sanjay Raut Custody : భూ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివసేన ప్రముఖ నాయకుడు , ఎంపీ సంజయ్ రౌత్ కు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు.
ఆదివారం అరెస్ట్ చేసిన సదరు నాయకుడిని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. భారతీయ జనతా పార్టీ రౌత్ ను చూసి భయపడి అరెస్ట్ చేసిందని ఎంపీ సోదరుడు సునీల్ రౌత్ ఆరోపించారు.
సంజయ్ రౌత్ అరెస్ట్ ను నిరసిస్తూ మహారాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇది రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి కాదని సంజయ్ రౌత్ తరపు న్యాయవాది ఆరోపించారు కోర్టులో.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈడీ ముంబై కార్యాలయం ముందు ఆస్పత్రి, కోర్టు వద్ద భారీగా బలగాలను మోహరించింది. ఈ ప్రాంగణంలో దాదాపు 200 మంది పోలీసులను శాంతి భద్రతల కోసం నియమించారు.
తనను కోర్టు గది లోపలికి తీసుకు వెళ్లే ముందు సంజయ్ రౌత్(Sanjay Raut) మీడియాతో మాట్లాడారు. ఇది మమ్మల్ని అంతం చేసేందుకు జరిగిన కుట్ర అని ఆరోపించారు.
ముంబై లోని రెసిడెన్షియల్ కాలనీ పునరాభివృద్ధిలో అక్రమాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ సంజయ్ రౌత్ ను ఎనిమిది రోజుల కస్టడీని కోరింది.
సంజయ్ రౌత్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని న్యాయవాది అశోక్ ముందర్గి కోర్టుకు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రోగి. శస్త్ర చికిత్స కూడా జరిగింది.
దీనికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించామన్నారు. కేంద్ర సర్కార్ రాజకీయ ఎజెండాల కోసం ప్రధాన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఆరోపించారు ఎంపీ ప్రియాంక చతుర్వేది.
Also Read : రాబోయే ఎన్నికల్లో మోదీనే ప్రధాని అభ్యర్థి