Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి ఈ మధ్య మతి చెడిందని , ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందంటూ మండిపడ్డారు. మణిపూర్ లో హింసను ఆపేందుకు బదులు ప్రతిపక్షాల గొంతును ఆపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు సంజయ్ సింగ్.
Sanjay Singh Slams Modi
మణిపూర్ హింసకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. సస్పెండ్ చేయండి లేదా జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం వ్యాపారస్తుల కోసం మాత్రమే ప్రధానమంత్రి పని చేస్తున్నారంటూ సంజయ్ సింగ్(Sanjay Singh) ఆరోపించారు.
ఓ వైపు మణిపూర్ కాలిపోతుంటే ఇంకో వైపు మోదీ విదేశాల పర్యటనకు వెళ్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇవాళ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ధ్వజమెత్తారు. దేశంలో డెమోక్రసీ లేకుండా పోయిందని , ప్రస్తుతం బీజేపీ, సంకీర్ణ సర్కార్ లేదని కేవలం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిందని సంచలన కామెంట్స్ చేశారు.
ఇప్పటికే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశ పెట్టడం, తమను ఇబ్బందులకు గురి చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను తమ వారికి ధారాదత్తం చేసిన ఘనుడు ఈ పీఎం అని మండిపడ్డారు.
Also Read : MLC Kavitha Launch : మహిళల వాయిస్ ‘షీ ది లీడర్’