Sanjay Singh AAP : వర్షంలోనే ఎంపీ సంజయ్ నిరసన
ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి
Sanjay Singh AAP : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వర్షంలో తడుస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఆవరణలో ఆయన నిరసన చేస్తున్నారు. మణిపూర్ లో చోటు చేసుకున్న హింసకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు వరకు స్పందించక పోవడం దారుణమన్నారు.
Sanjay Singh AAP Protest
ఇప్పటి వరకు 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 300 మందికి పైగా గాయపడ్డారని , 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు.
అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలే పోయారంటూ ప్రశ్నించారు ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh). విదేశాలలో పర్యటించేందుకు ప్రయారిటీ ఇస్తూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదంటూ ప్రశ్నించారు. దేశం ఆయనను క్షమించదన్నారు. సిగ్గుతో తలదించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇదిలా ఉండగా పదే పదే మోదీ సమాధానం చెప్పాలని కోరడం, సభ జరగకుండా అడ్డుకున్నందుకు పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు. దీంతో ఆయన పార్లమెంట్ వెలుపల ధర్నాకు దిగారు.
Also Read : Rahul Gandhi : ప్రజా నాయకుడు ఊమెన్ చాందీ