Sanju Samson : ఎవరీ స్టార్ హిట్టర్ అనుకుంటున్నారా. భారత క్రికెట్ లో ప్రత్యేకించి ఐపీఎల్ (IPL) లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందాడు కేరళకు చెందిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) స్కిప్పర్ సంజూ శాంసన్.
ఎలాంటి బంతులైనా సరే అలవోకగా బౌండరీ లైన్ ను దాటించే సత్తా ఉన్నోడు. కళ్లు చెదిరేలా సిక్సర్లు కొట్టడంలో మనోడు దిట్ట. ఇప్పుడు ఎలాగైనా సరే ఆర్ఆర్ కు ఐపీఎల్ (IPL) టైటిల్ తీసుకు రావాలని కంకణం కట్టుకున్నాడు.
ఇక ఐపీఎల్ (IPL) కెరీర్ పరంగా మనోడు అరుదైన ఘనత సాధించేందుకు రెడీ అయ్యాడు. ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 లో సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ తో అత్యధిక మ్యాచ్ లు ఆడిన చరిత్ర సంజూ శాంసన్(Sanju Samson) ది.
గతంలో అజింక్యా రహానే ఆ జట్టు తరపున రికార్డు సృష్టిస్తే ఇప్పుడు సంజూ శాంసన్ (Sanju Samson)వంతు వచ్చింది. 2013 ఐపీఎల్ (IPL) లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ హిట్టర్ ఇప్పటి దాకా 121 మ్యాచ్ లు ఆడాడు మూడు సెంచరీలు చేశాడు.
15 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. 134.21 సగటున మొత్తం 3 వేల 68 పరుగులు చేశాడు. ఇరు జట్లు బలంగా ఉన్నప్పటికీ పలువురు ఆటగాళ్లు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది ఇరు జట్లకు. ఇక సంజూ శాంసన్ తో పాటు దేవదత్ పడికల్ , జోస్ బట్లర్ , నాథన్ నీల్ , రవిచంద్రన్ అశ్విన్ , యజువేంద్ర చహల్ అరుదైన రికార్డులు సాధించేందుకు రెడీ అయ్యారు.
ఇక సన్ రైజర్స్ టీంలో పూరన్ , సమద్ కూడా వెయిట్ చేస్తున్నారు చరిత్ర సృష్టించేందుకు.
Also Read : మీ పోరాటం అద్భుతం అసాధారణం