Sanju Samson Fans FIFA : ఫిఫా వరల్డ్ కప్ లో ‘శాంసన్’ ఫీవర్
ఫ్యాన్స్ నీకున్నామంటూ హల్ చల్
Sanju Samson Fans FIFA : కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడని ఈ యువ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం భారత దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా క్రికెట్ రంగంలో శాంసన్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ లో కొనసాగుతూ వస్తున్నాడు ఈ క్రికెటర్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శాంసన్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు ఫ్యాన్స్ .
మాజీ క్రికెటర్లు. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, మాజీ ఓపెనర్ వసీం జాఫర్ , మాజీ భారత క్రికెట్ హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ దిగ్గజ క్రికెటర్ , 1983 వరల్డ్ కప్ తీసుకు వచ్చిన కపిల్ దేవ్ నిఖంజ్ , మహ్మద్ అజహరుద్దీన్ , కృష్ణమాచారి శ్రీకాంత్ , కుమార సంగక్కర, తదితర ఆటగాళ్లు పెద్ద ఎత్తున శాంసన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇదిలా ఉండగా శాంసన్ కు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా వారందరితో కలిసి ఉండడం శాంసన్ ప్రత్యేకత. అందుకే అతడంటే అంతగా ఆరాధిస్తారు. అభిమానిస్తారు. తాజాగా సంజూ శాంసన్ పేరు హల్ చల్ గా మారింది.
ఎక్కడో కాదు ప్రస్తుతం ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో. సంజూ వుయ్ లవ్ యూ(Sanju Samson Fans FIFA) అంటూ పోస్టర్లతో హోరెత్తించారు. ప్రస్తుతం శాంసన్ కు సంబంధించిన పోస్టర్లు, ఫ్యాన్స్ ఫోటోలు , వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
రాజస్థాన్ రాయల్స్ కూడా సంజూ శాంసన్ పోస్టర్లను షేర్ చేసింది. మా కెప్టెన్ కు ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఉన్నారంటూ పేర్కొంది.
Also Read : బీసీసీఐపై నిప్పులు చెరిగిన నెహ్రా
Everybody: Who are you supporting at the FIFA World Cup?
Us: pic.twitter.com/e66NRg78dh
— Rajasthan Royals (@rajasthanroyals) November 27, 2022