Sansad Ratna Award : సంసద్ రత్న పురస్కారాలను ఈ ఏడాదికి గాను ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్(Sansad Ratna Award) ప్రకటించింది. టీఎస్ కృష్ణ మూర్తి , అర్జున్ రామ్ మేఘ్యాల్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 11 మంది ఎంపీలను ఎంపిక చేసింది.
లోక్ సభ నుంచి ఎనిమిది మంది లోక్ సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
నలుగురు స్టాండింగ్ కమిటీలు, ఇద్దరు అనుభవజ్ఞులైన నాయకులు కూడా ప్రత్యేక అవార్డులకు నామినేట్ అయ్యారు.
మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, కేరళకు చెందిన ఆర్ఎస్పీ ఎంపీ ఎన్.కె. ప్రేమ చంద్రన్ ,
శివసేన పార్టీకి చెందిన ఎంపీ శ్రీరంగ్ అప్ప బర్నే లను సంసద్ విశిష్ట రత్న అవార్డుకు ఎంపికయ్యారు.
వీరితో పాటు జార్ఖండ్ కు చెందిన బీజేపీ ఎంపీ బిద్యుత్ బరన్ మహతో, అండమాన్ నికోబార్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ రాయ్ శర్మ, బీజేపీకి చెందిన హీనా విజయ కుమార్ గావిట్ ,
పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ , ఎంపీకి చెందిన శ్రీ సుధీర్ గుప్తా ను ఎంపిక చేసింది కమిటీ.
వివిధ కేటగిరీల కింద 17వ లోక్ సభలో ఎంపీలు కనబర్చిన పనితీరుకు గాను సంసద్ రత్న అవార్డులకు నామినేట్ చేసింది.
రాజ్యసభ నుంచి ఒడిశాకు చెందిన బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ ,
మహారాష్ట్ర కు చెందిన ఎన్సీపీ ఎంపీ ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్ , సీపీఎంకు చెందిన రాగేష్ ఎంపికయ్యారు.
జ్యూరీ కమిటీ మూడు లోక్ సభ కమిటీలను, ఒక రాజ్యసభ కమిటీని అవార్డుకు ఎంపిక చేసింది. వ్యవసాయ కమిటీ చీఫ్ గడ్డి గౌడర్ ,
ఫైనాన్స్ కమిటీ చీఫ్ జయంత్ సిన్హా, లేబర్ కమిటీ అధ్యక్షుడు మహతాబ్ , విద్యా కమిటీ చీఫ్ వినయ్ సహస్ర బుద్దే లను ఎంపిక చేసింది.
ఇక జీవిత కాల సాఫల్య పురస్కారం హెచ్ వి హండే, ఎం. వీరప్ప మొయిలీలకు దక్కింది. దివంగత భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచన మేరకు సంసద్ రత్న అవార్డును ఏర్పాటు చేశారు.