Sansad Ratna Awards : సంసద్ అవార్డుకు 13 మంది ఎంపిక
రాజ్యసభ నుంచి 5 మంది..లోక్ సభ నుంచి 8 మంది
Sansad Ratna Awards : ప్రతి ఏటా సంసద్ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సంసద్ పురస్కారానికి మొత్తం 13 మంది ఎంపీలను నామినేట్ చేశారు. ఇందులో రాజ్యసభ నుంచి 5 మంది ఎంపీలు నామినేట్ కాగా లోక్ సభ నుంచి 8 మంది ఎంపికయ్యారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత విషంబర్ ప్రసాద్ నిషాద్, కాంగ్రెస్ నాయకురాలు ఛాయా వర్మలను గత ఏడాది 2022 లో పదవీ విరమణ పొందారు. వీరు రాజ్యసభ నుంచి వీడ్కోలు తీసుకున్నారు.
ఈ ఇద్దరిని రాజ్యసభ కేటగిరీ కింద నామినేట్ చేశారు. 13వ సంసద్ రత్న అవార్డుకు సంబంధించి పురస్కారాలను ఈ ఏడాది 2023 మార్చి 25న దేశ రాజధాని ఢిల్లీలో ప్రదానం చేస్తారు. ఇదిలా ఉండగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ , భారత మాజీ ఎన్నికల కమిషనర్ టీఎస్ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ మొత్తం సంసద్ రత్న అవార్డుకు(Sansad Ratna Awards) సంబంధించి 13 మంది పార్లమెంట్ సభ్యులను ఎంపిక చేసింది. రాజ్యసభ, లోక్ సభ నుంచి ఎంపిక చేశారు.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఎస్పీ నుంచి నిషాద్ , కాంగ్రెస్ నుంచి ఛాయా వర్మ, సీపీఎం నుంచి రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ , రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నుంచి మనోజ్ కుమార్ ఝా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫౌజియా తహసిన్ అహ్మద్ ఖాన్ సిట్టింగ్ సభ్యుల కింద ఎంపికయ్యారు. 17వ లోక్ సభ నుండి 2022 శీతాకాల సమావేశాలు ముగిసే వరకు రాజ్యసభ, లోక్ సభ రెండింటికి ఆర్థికంగా డీఆర్ఎస్సీ నామినేట్ చేసింది.
Also Read : ప్రతీకారంతో దాడులు చేయడం లేదు