#Samidha : సతీష్ మాలెంపాటి సమిధ స‌గం పూర్తి

Satish Malempati 'Samidha' is Half complete

Samidha  : మర్మం‌, ‘కనులు కలిసాయి`వంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించిన ద‌ర్శ‌కుడు సతీష్ మాలెంపాటి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ స్టార్ హీరో శ‌శికుమార్ త‌న‌యుడు అక్షిత్ శ‌శికుమార్ హీరోగా తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల‌లో రూపొందుతోన్న చిత్రం ‘సమిధ`. రాజ‌స్థాన్‌లో జ‌రిగిన య‌థార్ధ సంఘ‌ట‌న ఆధారంగా మూడు భాష‌ల్లో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌గా ` తెర‌కెక్కుతోన్న ఈ మూవీని అరుణం ఫిలింస్ సంస్థ‌ నిర్మిస్తోంది. `ఉండిపోరాదే` మూవీ ఫేమ్ అనువ‌ర్ణ‌, త‌మిళ న‌టి ఛాందిని హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే 50% చిత్రీక‌రణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుండి సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

No comment allowed please