Satya Pal Malik : భీమ్ ఆర్మీ చీఫ్ పై దాడి దారుణం
మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
Satya Pal Malik : ఉత్తర ప్రదేశ్ లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన భీమ్ ఆర్మీ చీఫ్ ను వెంటనే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆయనకు గండం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ చీఫ్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు జమ్మూ , కాశ్మీర్ , మేఘాలయ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్.
రాజకీయ క్షేత్రంలో ఆలోచనా పరంగా లేదా భావజాలం పరంగా, సైద్ధాంతికంగా పోరాడాలే తప్పా ఇలా భౌతిక దాడులకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మాజీ గవర్నర్. బలహీనులు ఆయుధాలతో దాడికి పాల్పడతారు. ఎందుకంటే వారు ఆలోచనలతో పోరాడలేరు. వారికి చేత కాదు. దాడులు ఎప్పటికీ సమర్థనీయం కాదని స్పష్టం చేశారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik).
గత కొంత కాలంగా యూపీతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో భీమ్ రావ్ అంబేద్కర్ భావ జాలాన్ని కాపాడు కోవాలని కోరుతూ పెద్ద ఎత్తున అణగారిన వర్గాలను చైతన్యవంతం చేస్తూ వస్తున్నారని ప్రశంసించారు. దీనిని తట్టుకోలేని కొన్ని శక్తులు చంద్ర శేఖర్ ఆజాద్ పై దాడికి పాల్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు సత్య పాల్ మాలిక్.
Also Read : Nadendla Manohar : జగన్ ఇదే నా మీ సంస్కారం – నాదెండ్ల