Satya Pal Malik : అధికార మదానికి ప‌రాకాష్ట – మాలిక్

మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్

Satya Pal Malik : మ‌ద్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న యావ‌త్ భార‌త దేశాన్ని విస్తు పోయేలా చేసింది. అధికార మ‌దం త‌ల‌కెక్కితే ఎలా ఉంటుందో ఇది తెలియ చేస్తుంద‌ని పేర్కొన్నారు జ‌మ్మూ , కాశ్మీర్ , మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ . బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఒక ద‌ళితుడిపై ఎమ్మెల్యే అనుచ‌రుడు ఒక‌రు మూత్రం పోయ‌డం, ఇందుకు సంబంధించిన ఫోటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌డంతో వైర‌ల్ గా మారింది.

దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. కేంద్రంలో మోదీ సార‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ద‌ళితులు, ఆదివాసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల‌పై, బ‌హుజనుల‌పై దాడులు అధికం అయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik). ఇక‌నైనా ప్ర‌జ‌లు మారాల‌ని , త‌ల‌కు మించిన అధికారాన్ని దాని దుర‌హంకారాన్ని పెకిలించే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

రాబోయే ఎన్నిక‌ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి త‌గిన రీతిలో బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. లేక పోతే అరాచ‌కం ప్రజాస్వామ్యాన్ని క‌మ్మేస్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇక‌నైనా ప్ర‌జ‌లు మారక పోతే ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రిన్ని పున‌రావృతం అవుతాయ‌ని పేర్కొన్నారు స‌త్య పాల్ మాలిక్. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Also Read : DK Shiva Kumar : ఫుట్ బాట్ జ‌ట్టు స‌క్సెస్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!