Satya Pal Malik : నన్ను అరెస్ట్ చేసినా భయపడను
మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్
Satya Pal Malik : జమ్మూ కాశ్మీర్ , మేఘాలయ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ పై , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. కేంద్రం పదే పదే దర్యాప్తు సంస్థలను చూపించి విపక్షాలను, తనను భయ పెట్టాలని చూస్తోందని ఆరోపించారు సత్య పాల్ మాలిక్. ఈడీ, ఐటీ, ఈడీ ఎన్ని సంస్థలతో ప్రయోగం చేసినా ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగుతాయని, ఎన్నికల బరిలో నిలబడతాయని , ప్రజలకు కూడా ఇదే ప్రత్యామ్నాయం అన్నారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik).
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు ఇప్పుడు తాను కంట్లో నలుసుగా మారానని అన్నారు. వాళ్ల ఫోకస్ అంతా ప్రస్తుతం తనపై ఉందన్నారు. ఎందుకంటే బీజేపీని, మోదీని, అమిత్ షాను ఏకి పారేస్తున్నది తాను ఒక్కడినేనని గనుక వాళ్లు తనను టార్గెట్ చేస్తారని అయినా తాను పట్టించు కోనని సత్య పాలిక్ అన్నారు. త్వరలో వాళ్లు నన్ను కూడా ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని, కానీ తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదంటూ స్పష్టం చేశారు మాజీ గవర్నర్ .
Also Read : Rahul Childrens : హింస కంటే ప్రేమ గొప్పది – రాహుల్