Satyendar Jain : స‌త్యేంద‌ర్ జైన్ కేసు విచార‌ణ

ఈడీ వివ‌ర‌ణ కోరిన హైకోర్టు

Satyendar Jain : ఆప్ మంత్రి స‌త్యేంద్ర జైన్ కేసును కొత్త న్యాయ‌మూర్తికి బ‌దిలీ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఈ కేసుకు సంబంధించి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)ని స‌మాధానం కోరింది. మ‌నీ ల్యాండ‌రింగ్ కు మంత్రి స‌త్యేంద్ర జైన్(Satyendar Jain) పాల్ప‌డిన‌ట్లు ఈడీ ఆరోప‌ణ‌లు చేసింది.

ఈ మేర‌కు కేసు న‌మోదు చేసింది. ఇదిలా ఉండ‌గా త‌న పిటిష‌న్ ను కొత్త న్యాయ‌మూర్తికి బ‌దిలీ చేసిన ట్ర‌య‌ల్ కోర్టు ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద‌ర్ జైన్(Satyendar Jain) వేసిన పిటిష‌న్ పై ఢిల్లీ హైకోర్టు సోమ‌వారం ఈడీ ప్ర‌తిస్పంద‌న‌ను కోరింది.

విచార‌ణ సంస్థ త‌ర‌పున అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్వీ రాజు వాదించారు. ఇందుకు సంబంధించి కొంత స‌మ‌యం కావాల‌ని కోరారు. దీంతో జ‌స్టిస్ యోగేష్ ఖ‌న్నా నోటీసు జారీ చేశారు.

కేసు విచార‌ణ‌ను బుధ‌వారంకు వాయిదా వేశారు. ఇక మంత్రి త‌ర‌పు న్యాయ‌వాది ఎన్. హ‌రి హ‌ర‌న్ స‌మ‌యం మంజూరుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. జైన్ బెయిల్ ద‌ర‌ఖాస్తు చాలా కాలంగా పెండింగ్ లో ఉంద‌న్నారు.

ఈ కేసును మ‌రో న్యాయ‌మూర్తికి బ‌దిలీ చేసేందుకు నెల రోజుల పాటు వాద‌న‌లు జ‌రిగాయ‌ని తెలిపారు. న్యాయమూర్తి నిజాయితీగా ఉన్నార‌ని మ‌రి అలాంట‌ప్పుడు కేసును ఎందుకు బ‌దిలీ చేశారంటూ ప్ర‌శ్నించారు.

దీని వెనుక రాజ‌కీయ కుట్ర కోణం దాగి ఉంద‌ని ఆరోపించింది ఆమ్ ఆద్మీ పార్టీ(AAP).

Also Read : రాజ‌కీయ సంక్షోభం దుర‌దృష్ట‌క‌రం

Leave A Reply

Your Email Id will not be published!