Saurashtra Win : సౌరాష్ట్ర రెండోసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పశ్చిమ బెంగాల్ ను ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడించింది. గత ఏడాది 2022లో సైతం సౌరాష్ట్రనే గెలుపొందడం విశేషం.
మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది బెంగాల్ టీం. కేవలం 174 పరుగులకే కుప్ప కూలింది. అర్పిత్ వసవాడ 81 రన్స్ చేస్తే , షెల్టన్ జాక్సన్ 59 , హర్విక్ దేశాయ్ 50 , చిరాగ్ జెనీ 60 రన్స్ చేశారు. ఇక సౌరాష్ట్ర తరపున చేతన్ సకారియా , జయదేవ్ ఉనాద్కత్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర భారీ స్కోర్ సాధించింది.
ఏకంగా 404 రన్స్ చేసింది. అనంతరం 230 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగింది పశ్చిమ బెంగాల్ . జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్ దెబ్బకు కేవలం 241 పరుగులకే ఆలౌటైంది. మరోజ్ తివాలి 68 రన్స్ చేస్తే ముజుందార్ 61 పరుగులు చేశారు. అనంతరం కేవలం 12 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన సౌరాష్ట్ర(Saurashtra Win) సునాయసంగా 2.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో 2023 లో రంజీ ట్రోఫీని(Ranji Trophy) మరోసారి చేజిక్కించుకుంది.
ఇదిలా ఉండగా భారత జట్టుకు ఎంపికైన ఉనాద్కత్ ను బీసీసీఐ విడుదల చేసింది కేవలం ఫైనల్ లో ఆడేందుకు. తన సత్తా ఏమిటో చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసిన ఉనాద్కట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీ లో 907 రన్స్ చేసిన వసవాడాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా ఎంపికయ్యాడు.
Also Read : రెండో టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ