TS Schools Holidays : మూడు రోజులు విద్యా సంస్థ‌లు బంద్

జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

TS Schools Holidays : నైరుతి రుతు ప‌వ‌నాల ప్ర‌భావంతో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల దెబ్బ‌కు అటు మ‌హారాష్ట్ర‌లో ఇటు తెలంగాణ‌లో వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు రాష్ట్రంలోని విద్యా సంస్థల‌కు(TS Schools Holidays) సెల‌వులు ప్ర‌క‌టించారు.

తాజాగా వ‌ర్షాలు కుండ పోత‌గా కురుస్తుండ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది ఈ మేర‌కు మ‌రో మూడు రోజుల పాటు పొడిగించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ప్రాథ‌మిక‌, మాధ్య‌మిక‌, ఉన్న‌త స్థాయిల‌కు సైతం మ‌రోసారి మూడు రోజుల పాటు సెల‌వులు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇవాల్టి అనుంచి ఈనెల 13 నుంచి 16 వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది.

దీంతో తిరిగి విద్యా సంస్థ‌లు తెర‌వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఉన్న‌త విద్యా శాఖ కార్య‌ద‌ర్శి వాకిటి క‌రుణ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వ‌ర్షాల తీవ్ర‌త‌కు ప‌లు జిల్లాలు నీళ్ల‌తో నిండి పోయాయి. ర‌హ‌దారుల‌న్నీ నీట మునిగాయి. బ‌డుల‌కు సంబంధించి భ‌వ‌నాలు శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయి. పిల్ల‌లు స్కూళ్ల‌కు వెళ్లే ప‌రిస్థితి లేకుండా పోయింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

కొన్ని జిల్లాల్లో కూర్చునేందుకు, టీచ‌ర్లు వెళ్లేందుకు వీలు లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక కుండ పోత దెబ్బ‌కు ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ మ‌రోసారి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మ‌రికొన్ని రోజుల పాటు భారీగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

Also Read : బీటెక్​ విద్యార్థులకు బ్యాడ్​న్యూస్ 25 శాతం ఫీజుల మోత

Leave A Reply

Your Email Id will not be published!