DRDO Scientist Arrest : డిఆర్‌డిఓ శాస్త్రవేత్త అరెస్ట్ – ఏటీఎస్
పాకిస్తాన్ కు భారత్ సమచారం చేరవేత
DRDO Scientist Arrest : దాయాది పాకిస్తాన్ కు రహస్య సమాచారం అందించినందుకు రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) లో పని చేస్తున్న భారత్ కు చెందిన శాస్త్రేవత్త అరెస్ట్(DRDO Scientist Arrest) అయ్యారు. వాట్సాప్ ,వీడియో కాల్స్ ద్వారా సదరు శాస్త్రవేత్త భారత దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని నిరంతరం చేరవస్తున్నాడని ఆరోపించింది ఎన్ఐఏ. నిరంతరం సదరు దేశంతో టచ్ లో ఉన్నాడని వెల్లడించింది. విస్తు పోయే విషయాలు వెలుగు చూశాయని పేర్కొంది.
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఏజెంట్ తో టచ్ లో ఉన్నాడరి ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు. సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించామని, ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గత కొంత కాలంగా పూర్తి నిఘా ఉంచామని స్పష్టం చేశారు. ముంబైలోని పుణెలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (డీఆర్డీఓ)లో పని చేస్తున్నాడని పేర్కొంది ఏటీఏ.
పాకిస్తాన్ ఏజెంట్ కు రహస్య సమాచారం అందించినందుకు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అదుపులోకి తీసుకున్నామని ప్రకటించింది. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఇంకా ఇందులో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై ఆరా తీస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ఉన్నత పదవిలో ఉన్నారని పేర్కొంది. మరో వైపు దీనిని హానీ ట్రాప్ గా అనుమానం వ్యక్తం చేస్తోంది ఏటీఎస్.
Also Read : రెజ్లర్ల పోరాటం ఖాకీల ఉక్కుపాదం