Nirmala Sitharaman: సెబీ చీఫ్‌ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

సెబీ చీఫ్‌ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

Nirmala Sitharaman: సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ దంపతుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) తొలిసారి స్పందించారు. మాధబి పురి బచ్‌, ఆమె భర్త ధవల్‌ బచ్‌ తమను తాము రక్షించుకొంటూనే, తమపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా స్పందిస్తున్నారన్నారు. చాలా ఆరోపణలకు సమాధానాలు వస్తున్నాయ్‌. ఈ నిజాలను వాళ్లు పరిగణనలోకి తీసుకుంటారనే అనుకుంటున్నాను అని ఆమె అన్నారు. మాధబి పురి బచ్‌ సమాధానాలపట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? అనే మరో ప్రశ్నకు.. నేనిక్కడ ఉన్నది అది తప్పో, ఒప్పో నిర్ధారించేందుకు కాదు అని నిర్మలా సీతారామన్‌ బదులిచ్చారు.

బచ్‌ దంపతులు అక్రమాలకు పాల్పడ్డారని, లాభాపేక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. అదానీ వ్యవహారంలో బచ్‌ అవినీతికి దిగారని హిండెన్‌బర్గ్‌ ఆరోపించినదీ తెలిసిందే. బయటి శక్తుల ప్రోద్బలంతోనే నిరసనలు చేస్తున్నారంటూ రెండువారాల క్రితం తమ ఉద్యోగులకు వ్యతిరేకంగా విడుదల చేసిన ప్రకటనను సెబీ సోమవారం ఉపసంహరించుకొంది.

Nirmala Sitharaman – సమస్యలను పరిష్కరిస్తామని హామీ

బయటి శక్తుల ప్రోద్బలంతోనే నిరసనలు చేస్తున్నారంటూ రెండువారాల క్రితం తమ ఉద్యోగులకు వ్యతిరేకంగా విడుదల చేసిన ప్రకటనను సెబీ సోమవారం ఉపసంహరించుకొంది. ఉద్యోగుల సమస్యలను అంతర్గతంగానే పరిష్కరిస్తామని తెలిపింది. తద్వారా సంస్థ చైర్‌ పర్సన్‌ మాధవి బుచ్‌ తమను వేధిస్తున్నారన్న, సెబీలో పని వాతావరణం అధ్వాన్నంగా ఉందన్న ఉద్యోగుల ఆరోపణలను అంగీకరించినట్లైంది. సెబీలో పని వాతావరణం అతి దారుణంగా ఉందని అందులో పనిచేసే 500 మంది గ్రేడ్‌ ఏ ఉద్యోగులు ఆగస్టు 6న ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సెబీ సమావేశాల్లో అరవడం, తిట్టడం, వేధించడం, అవమానించడం సర్వసాధారాణంగా మారాయి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.సెబీలో నాయకత్వ స్థానాల్లో ఉన్నవారిపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు అని కొన్ని రోజుల క్రితం ఓ మీడియా కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో సెబీ సెప్టెంబరు 4న తమ ఉద్యోగులపై పలు ఆరోపణలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

Also Read : Sanjay Gaikwad : రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!