S Jai Shankar : సియోల్ ఘ‌ట‌న దిగ్భ్రాంతిక‌రం – జైశంక‌ర్

151 మంది మృతి 100 మందికి గాయాలు

S Jai Shankar : ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 151 మందికి పైగా మృతి చెందారు. ఇందులో 97 మంది మ‌హిళ‌లు చ‌ని పోగా 50 మందికి పైగా పురుషులు ప్రాణాలు కోల్పోయారు. యావ‌త్ ప్ర‌పంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప‌లు దేశాధినేత‌లు, ప్ర‌ధానులతో పాటు ఐక్య‌రాజ్య స‌మితి తీవ్ర సంతాపం తెలియ చేసింది.

స‌హాయ‌క చ‌ర్య‌లలో ద‌క్షిణ కొరియా ప్ర‌భుత్వం నిమ‌గ్న‌మైంది. ఇవాల్టి నుంచి కొన్ని రోజుల పాటు సంతాప దినాలుగా ప్ర‌క‌టించారు దేశ అధ్య‌క్షుడు. ఇదిలా ఉండ‌గా సియోల్ లో చోటు చేసుకున్న భారీ ప్ర‌మాదానికి సంబంధించి స్పందించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar).

ఆయ‌న తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భార‌త దేశం ఈ ఘ‌ట‌నను చూసి త‌ట్టుకోలేక పోయింద‌ని పేర్కొన్నారు. ఎలాంటి స‌హాయం కావాల‌న్నా తాము సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. చ‌ని పోయిన వారి కుటుంబాల‌కు సంతాపం తెలిపారు జై శంక‌ర్. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి(S Jai Shankar).

ఈ క్లిష్ట స‌మ‌యంలో ద‌క్షిణ కొరియాకు భార‌త్ పూర్తిగా సంపూర్ణ స‌హ‌కారం క‌ల్పిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎలాంటి సాయం కావాల‌న్నా రెడీగా ఉన్నామ‌ని ఆయ‌న ద‌క్షిణ కొరియా స‌ర్కార్ కు వెల్ల‌డించారు.

సియోల్ లోని మార్కెట్ లో కేవ‌లం 4 మీట‌ర్ల వెడ‌ల్పు గ‌ల సందులో 1,00,000 మంది ప్ర‌జ‌లు చేర‌డంతో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 151 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Also Read : సియోల్ తొక్కిస‌లాటలో 151 మంది మృతి

Leave A Reply

Your Email Id will not be published!