Covid19 Updates : దేశంలో కొత్త‌గా 1,604 కేసులు న‌మోదు

మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,29,016

Covid19 Updates : క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టినా క్ర‌మ క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. క‌రోనా కార‌ణంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా దేశంలో 1,604 క‌రోనా కేసులు(Covid19 Updates) న‌మోద‌య్యాయి. ఈ విష‌యాన్ని కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసింది. క్రియాశీల సంఖ్య 18,317 కి ప‌డి పోయింది.

ఇక క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,29,016కి చేరుకుంది. ఇవాళ ఎనిమిది మంది క‌రోనాతో మృతిచెందారు. ఇందులో కేర‌ళ‌లో ముగ్గురు చ‌ని పోయారు. ఆదివారం వెల్ల‌డించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గ‌ణాంకాల ప్రకారం ఒకే రోజులో మ‌రో 1,604 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

ఈ మొత్తం చోటు చేసుకున్న క‌రోనా కేసుల సంఖ్య‌తో దేశంలో 4,46,52,266కి చేరుకుంది. క్రియాశీల కేసుల సంఖ్య 18,317కి త‌గ్గింది. ఈ వ్యాధి కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,29,016కి చేరుకుంది. ఇదిలా ఉండ‌గా మొత్తం ఇన్ఫెక్ష‌న్ల‌లో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండ‌గా జాతీయ కోవిడ్ -19 రిక‌వ‌రీ రేటు 98.77 శాతానికి పెరిగింద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో 485 కేసులు త‌గ్గుద‌ల న‌మోద‌య్యాయ‌ని డేటా తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్ర‌కారం రోజూ వారీ సానుకూల‌త రేటు 1.02 శాతం , వార‌పు సానుకూల‌త రేటు 1.08 శాతంగా న‌మోదైంది. ఇక క‌రోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,04,933కి పెరిగింది. కేసు మ‌ర‌ణాల సంఖ్య రేటు 1.18 శాతంగా న‌మోదైంది.

మంత్రిత్వ శాఖ ప్ర‌కారం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కింద ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 219.63 కోట్ల డోసులు అందిచ‌న‌ట్లు తెలిపింది.

Also Read : రేపిస్టులు..డేరా బాబాపై చ‌ర్యలు తీసుకోండి

Leave A Reply

Your Email Id will not be published!