Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! ఏడుగురు మృతి !
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! ఏడుగురు మృతి !
Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రెండు లారీలు, ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు రంగంలోనికి దిగిన పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం… మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. తరువాత ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనితో బస్సు ముందు భాగంతో పాటు రెండు లారీల ముందుభాగాలు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బస్సు ప్రమాద ఘటనలపై నెల్లూరు(Nellore) ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్ది మాట్లాడుతూ… ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. గాయపడిన వారిని నెల్లూరు, ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాం. బాధితుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని… 9440796383 ద్వారా మృతులు, క్షతగాత్రుల బంధువులకు సమాచారం ఇస్తున్నామన్నారు. అమితు ప్రమాదానికి కారణం ఏమిటన్నది విచారణలో తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
Nellore Road Accident – బస్సు ప్రమాధ ఘటనపై గవర్నర్ అబ్ధుల్ నజీర్ దిగ్భ్రాంతి
నెల్లూరు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు.
Also Read : AP News : ఏపీలో ఈ పార్టీ నుంచి పోటీచేయడానికి 793 దరఖాస్తుల..