Tejashwi Yadav : విద్వేషాలు రెచ్చగొట్టేందుకే షా టూర్ – తేజస్వి
బీహార్ డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్
Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం నిర్వాకంపై ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు.
కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా జాదూ అన్నది దేశానికి మొత్తం తెలుసన్నారు. పేరుకు మోదీ ప్రధానమంత్రి అయినా మొత్తం నడిపించేదంతా షానే అన్నది వాస్తవామన్నారు.
జేడీయూ మాత్రమే ఎందుకు అమిత్ షాను బీహార్ వాసులే కాదు దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు తేజస్వి యాదవ్(Tejashwi Yadav). నీతులు వల్లె వేసే బీజేపీ శ్రేణులు జైలుకు వెళ్లి వచ్చారన్న సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా అమిత్ షాపై తేజస్వి యాదవ్ ఇంత ఘాటు స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కేంద్ర హొం శాఖ మంత్రి బీహార్ లో పర్యటించడం అంటే మత పరమైన ఉద్రిక్తతలను రేకెత్తించడమేనని , ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
గత కొంత కాలంగా బీజేపీని, అమిత్ షాను టార్గెట్ చేస్తూ వచ్చారు తేజస్వి యాదవ్. 23, 24 తేదీలలో రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
పూర్నియా జిల్లాలో ర్యాలీ నిర్వహించి, మరుసటి రోజు కిషన్ గంజ్ లో సంస్థాగత సమావేశాలు నిర్వహించనుంది బీజేపీ. అమిత్ షా సమావేశాల్లో పాల్గొంటున్నారు.
అమిత్ షా వల్ల దేశానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదని ధ్వజమెత్తారు అమిత్ షా.
Also Read : రాజస్థాన్ ఎమ్మెల్యేలకు సీఎం భరోసా