Shashi Tharoor Ambedkar : థరూర్ ‘అంబేద్కర్’ కలకలం
జీవిత చరిత్ర పుస్తకం సంచలనం
Shashi Tharoor Ambedkar : శశి థరూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి మరీ పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పాపులర్ ఐకానిక్ లీడర్ . ఇటీవలే ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. వేయికి పైగా ఓట్లను సాధించి తన సత్తా ఏమిటో చూపించాడు.
ఆయన పూర్తిగా ఆధునిక భావజాలంతో కూడుకున్న నాయకుడు. అంతే కాదు వక్త, మెంటార్, అద్భుతమైన రచయిత కూడా. తాజాగా శశి థరూర్ భారత దేశ రాజ్యాంగ నిర్మాత, నిమ్న, బహుజన వర్గాలు ఆరాధించే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్(BR Ambedkar) గురించి జీవిత చరిత్ర రాశారు. ప్రస్తుతం థరూర్ రాసిన ఈ గ్రంథం కలకలం రేపుతోంది.
మిగతా రచయితలు ఎంతో మంది ఎన్నో రకాలుగా పరిచయం చేశారు. పరిశోధించారు..తమ తమ కోణాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ శశి థరూర్ భిన్న కోణంలో పరిచయం చేసిన తీరు మెచ్చుకోకుండా ఉండలేం. ఈ పుస్తకంలో ప్రధానంగా ఉన్నత కులాలు ఎలా ఆందోళన చెందుతున్నాయో తెలిపే ప్రయత్నం చేశాడు రచయిత.
థరూర్ తన 65 ఏళ్ల జీవితంలో చట్టం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం అందించిన మార్గాలను అన్వేషించారు. కాలక్రమానుసారంగా వ్యవస్థీకృతమైన పాజిటివిస్ట్ చరిత్రను మాత్రమే అందించారు. కులం ఏ రకంగా భారతీయ సమాజంలో పేరుకు పోయిందో కూడా వివరించే ప్రయత్నం చేశారు శశి థరూర్.
ఆయన అంబేద్కర్ చేత ఆకర్షితుడయ్యాడు. కుల వ్యతిరేక స్పృహను ప్రోత్సహించకుండా అతడి గుర్తింపునకు సంబంధించిన కోణాన్ని అన్వేషించారు. ఇదే సమయంలో అంబేద్కర్ ను బీజేపీ తమ స్వంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని హెచ్చరించారు శశి థరూర్(Shashi Tharoor) . ఏది ఏమైనా ఆద్యంతమూ చదివించే గుణం కలిగిన రచయిత కావడం మరింత ఆసక్తిని పెంచేలా చేసింది.
Also Read : సోనియా గాంధీ కాంగ్రెస్ ను కాపాడిన దేవత
An excellent discussion on Dr #Ambedkar & my recent biography of him, with Utkarsh Amitabh of @netcapglobal: https://t.co/8aQkdqi3os
— Shashi Tharoor (@ShashiTharoor) October 25, 2022