Shashi Tharoor : కాంగ్రెస్ చీఫ్ ఎన్నికపై థ‌రూర్ కామెంట్స్

పార‌ద‌ర్శ‌కంగా సాగ‌ల‌ని సీనియ‌ర్ల డిమాండ్

Shashi Tharoor :  సుదీర్ఘ కాలం త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే తేదీ కూడా ఖ‌రారు చేశారు. వ‌చ్చే అక్టోబ‌ర్ 17న చీఫ్ కోసం ఎన్నిక నిర్వ‌హిస్తారు. 19న ఫ‌లితాన్ని ప్ర‌క‌టిస్తారు.

ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు కీల‌క‌, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. నిన్న‌టి దాకా రాహుల్ గాంధీ పోటీలో ఉంటారా ఉండ‌రా అన్న అనుమానానికి తెర దించారు.

త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి భార‌త్ జోడో యాత్ర ప్రారంభించారు. 3,570 కిలోమీట‌ర్ల మేర ఈ యాత్ర సాగ‌నుంది. 150 రోజులు జ‌రుగుతుంది.

ఈ యాత్ర‌లో రాహుల్ గాంధీ స్వ‌యంగా పాల్గొంటున్నారు. ఆయ‌న‌తో పాటు సీఎంలు అశోక్ గెహ్లాట్(Ashok Gehlot), భూపేష్ భ‌ఘేల్ పార్టిసిపేట్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా మీడియా సంధించిన ఏకైక ప్ర‌శ్న‌కు మీరు ఎన్నిక‌ల బ‌రిలో ఉంటారా అన్న ప్ర‌శ్న‌కు ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. ఎందుకు ఉండ‌ని మీరు అనుకుంటున్నారంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు.

ఇదే స‌మ‌యంలో కేంద్ర స‌ర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

చీఫ్ ప‌ద‌విని పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వారిలో ప్ర‌ధానంగా తిరువ‌నంత పురం ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor)  ఉన్నారు. ఆయ‌న మ‌రోసారి ఇదే ప్ర‌ధాన డిమాండ్ ను ముందుకు తీసుకు వ‌చ్చారు.

ఈ మేర‌కు ఐదుగురు ఎంపీలు ఏఐసీసీ కేంద్ర ఎన్నిక‌ల అథారిటీ చీఫ్ మ‌ధుసూద‌న్ మిస్త్రీకి లేఖ రాశారు.

Also Read : నూపుర్ శ‌ర్మ‌పై పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!