Shashi Tharoor : శశి థరూర్ కీలక కామెంట్స్
చింతన్ శివిర్ తర్వాత ఫైర్
Shashi Tharoor : కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు శశి థరూర్(Shashi Tharoor) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక గ్రూప్ జీ23లో ఉన్నారు.
పదే పదే ఆయన స్పందిస్తూ వస్తున్నారు. ప్రధానంగా అసమ్మతి నాయకులు పార్టీ పార్లమెంటరీ పునరుద్దరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ వస్తున్నారు.
గుజరాత్ లోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు జరిగిన చింతన్ శివర్ లో దీనిని ప్రధానంగా ప్రస్తావించారు. కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దానిని అప్రధాన్యత అంశంగా పక్కన పెట్టింది.
దీనిపై మరోసారి లేవనెత్తారు శశి థరూర్. ఒకవేళ దీనిని పునరుద్దరిస్తే గనుక ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ పవర్స్ కు కత్తెర పడుతాయని భావిస్తుండడం వల్లే పుల్ స్టాప్ పెట్టిందన్న ఆరోపణలున్నాయి.
ఇక 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దం కావాల్సి ఉంది. ఈ తరుణంలో తాజాగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటల కారణంగా రాష్ట్రంలో బలమైన కమ్యూనిటీగా ఉన్న పటేదార్ వర్గానికి చెందిన నాయకుడు హార్దిక్ పటేల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
జాతీయ ఎన్నికల్లో పేలవమైన పనితీరు తర్వాత రాహుల్ గాంధీ 2019లో పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచీ కొంత గందరగోళం నెలకొంది.
కాగా శశి థరూర్(Shashi Tharoor) సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి పార్టీ కార్యకర్తల ప్రాధానత ఎంపిక గా మిగిలి పోయారంటూ పేర్కొన్నారు.
Also Read : భారత దేశం శ్రీలంకను తలపిస్తోంది