Shashi Tharoor : బీజేపీపై భగ్గుమన్న శశి థరూర్
పర్వేజ్ సంతాపం వివాదాస్పదం
Shashi Tharoor : పాకిస్తాన్ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ 79 ఏళ్ల వయస్సులో దుబాయ్ లో చికిత్స పొందుతూ ఆదివారం కన్ను మూశారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. భారత దేశంతో సంబంధాలు నెరిపారని కానీ ఫెయిల్ అయ్యారంటూ పేర్కొన్నారు.
ఒక రకంగా శాంతి కోసం తన వంతు ప్రయత్నం చేశారని, ఐక్య రాజ్య సమితిలో తాను తరుచూ కలుస్తూ ఉండే వాడినని ఈ సందర్భంగా ముషారఫ్ తనతో ఎన్నో కీలక అంశాల గురించి పంచుకున్నారని తెలిపారు శశి థరూర్(Shashi Tharoor). ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపింది. ఒక భారతీయుడై ఉండి పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిని ఎలా పొగుడుతారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది బీజేపీ.
అంతే కాదు ఎంపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో సీరియస్ గా స్పందించారు ఎంపీ శశి థరూర్. తనకు పాఠాలు చెప్పే స్థితిలో బీజేపీ లేదని, దాని అనుబంధ సంస్థలతో చెప్పించుకునేంత దిగజారి లేనని మండిపడ్డారు . పొద్దస్తమానం కులం, ప్రాంతం, మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు శశి థరూర్.
భారత దేశం పుణ్య భూమి అని, ఇక్కడ శత్రవులకు సైతం చోటు ఉంటుందనే విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు ఎంపీ. గతంలో పీఎం వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఎందుకు ముషారఫ్ తో చర్చలు జరిపిందని నిలదీశారు.
Also Read : అదానీపై విచారణ చేపట్టాలి – కాంగ్రెస్