Shashi Tharoor : మోదీ మౌనం వీడక పోతే కష్టం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఫైర్
Shashi Tharoor : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో దీక్ష చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తో పాటు ఆయన భార్య, పేరెంట్స్ ను పరామర్శించారు. ఇది పూర్తిగా ఏకపక్ష, కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). మణిపూర్ లో చర్చకు పిలవాలని , దీనిపై చర్చించాలని కోరుతూ 26 ప్రతిపక్షాలకు చెందిన కూటమి ఇండియా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
Shashi Tharoor Comments
ఇదిలా ఉండగా ఆప్ ఎంపీ పదే పదే ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కోరారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు ఎంపీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎంపీలు. ఆయనకు సంఘీభావం తెలిపారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ఎంపీ సంజయ్ సింగ్ ను పరామర్శించిన శశి థరూర్ ధైర్యంగా ఉండాలని అన్నారు. తాను కూడా సస్పెన్షన్ వేటు ఎత్తి వేయాలని స్పీకర్ ను కోరుతానని చెప్పారు. ఇకనైనా మోదీ తాను చేస్తున్న తప్పు ఏమిటో తెలుసు కోవాలన్నారు. లేక పోతే మౌనం వీడక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : Jitta Balakrishna Reddy : మానసికంగా బీజేపీకి దూరమయ్యాను