Uddhav Ambedkar Party : అంబేద్క‌ర్ పార్టీతో శివ‌సేన పొత్తు

బాల్ ఠాక్రే జ‌యంతి రోజు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Uddhav Ambedkar Party : మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. మ‌హ‌రాష్ట్ర‌లో ఎంద‌రో మ‌హానుభావులు పుట్టారు. వారిలో భిన్న‌మైన దృక్ఫ‌థాలు, ఆలోచ‌న‌లు క‌లిగి ఉన్నారని, అందులో భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ అయితే మ‌రొక‌రు హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లిన బాల్ ఠాక్రే అని స్ప‌ష్టం చేశారు శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే.

త్వ‌ర‌లో ముంబైలో బ‌ల్దియా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ కు చెందిన వంచిత్ బ‌హుజ‌న్ అఘాడీ (వీబీఏ) పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Ambedkar Party). గ‌త ఏడాది మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వం కూలి పోయింది.

శివ‌సేన పార్టీ చీలి పోయింది. ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలో ప్ర‌స్తుతం బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండ‌గా స‌ర్కార్ కూలి పోయిన త‌ర్వాత జ‌ర‌గ‌బోయే తొలి ఎన్నిక‌లు ఇవి. కాగా భార‌త రాజ్యాంగాన్ని రూపొందించిన భీమ్ రావ్ అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ తో ఉద్ద‌వ్ ఠాక్రే రెండు నెల‌ల‌కు పైగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

ఇవాళ అంద‌రికీ ప్ర‌ధానంగా మ‌రాఠా యోధుల‌కు , రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభ‌దినం. ఎందుకంటే ఇవాళ మ‌రాఠా యోధుడు బాల్ ఠాక్రే పుట్టిన రోజు. మ‌న‌మంతా క‌లిసి ముందుకు సాగాల‌ని అనుకుంటున్నాం. ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

Also Read : మ‌రాఠా యోధుడికి మ‌ర‌ణం లేదు

Leave A Reply

Your Email Id will not be published!