Shiv Sena Mla Slaps : ఫుడ్ మేనేజర్ పై శివసేన ఎమ్మెల్యే దాడి
చెంప చెల్లుమనిపించిన శివసేన ఎమ్మెల్యే
Shiv Sena Mla Slaps : మహారాష్ట్రకు చెందిన శివసేన ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఆహారం విషయంలో చెంప చెళ్లుమనిపించారు. కూలీలకు అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన మరాఠాలో చోటు చేసుకుంది. దాడికి దిగింది ఎవరో కాదు శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్. అంతే కాదు సదరు క్యాటరింగ్ మేనేజర్ నానా దుర్బాషలాడారు.
ఆపై దాడికి దిగడం కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా సంతోష్ బంగర్ మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షకు నిమిషాల ముందు ఏక్ నాథ్ షిండే క్యాంపులో చేరారు.
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా కూలీలకు ఆహారం అందిస్తున్నారు. ఈ ఆహారంలో నాణ్యత లోపించిందని దీనికి నువ్వే కారణమంటూ క్యాటరింగ్ మేనేజర్ చెంపపై ఎమ్మెల్యే(Shiv Sena Mla Slaps) సంతోష్ బంగర్ కొట్టారు.
ఈ విషయంపై స్పందించారు ఎమ్మెల్యే బంగర్. ఆహారం తమకు సరిగా పెట్టడం లేదని, నాణ్యత పాటించడం లేదంటూ పెద్ద ఎత్తున తనకు ఫిర్యాదులు అందాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
ఈ ఫిర్యాదులు వాస్తవమా లేక అబద్దమా అన్న దానిని పరిశీలించేందుకు తాను సైట్ కు వెళ్లానని చెప్పారు. ప్రస్తుతం సంతోష్ బంగర్ మహారాష్ట్ర లోని హింగోలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే తిరుగుబాటు ప్రకటించిన సంతోష్ బంగర్ ను హింగోలి శివసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించారు మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే.
Also Read : అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్యపై వేటు