Shiv Sena Saamana : హిట్లర్ ను తలపిస్తున్న కేంద్ర పాలన
ఇక గ్యాస్ ఛాంబర్లను నిర్మించడమే మిగిలింది
Shiv Sena Saamana : శివసేన పార్టీ అధికారిక వాయిస్ గా పేరొందిన సామ్నా(Shiv Sena Samna) పత్రిక సంపాదకీయంలో కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనను ఆనాటి హిట్లర్ పాలనతో పోల్చింది.
అంతే కాదు గ్యాస్ ఛాంబర్లను నిర్మించడం ఒక్కటే ఇక మిగిలి ఉందని ఎద్దేవా చేసింది. భారతీయ జనతా పార్టీ జవహర్ లాల్ నెహ్రూ , ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను చెరిపి వేసే ప్రయత్నంలో సక్సెస్ అయ్యిందంటూ పేర్కొంది.
ఇదే సమయంలో నెహ్రూ, గాంధీ వంశానికి సంబంధించిన అవకాశాలను కూడా నాశనం చేయాలని అనుకుంటోందంటూ నిప్పులు చెరిగింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కు సమన్లు జారీ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఇదిలా ఉండగా సోనియాకు కరోనా సోకడంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. ఈనెల 23న హాజరు కానుంది. ఇక రాహుల్ గాంధీ ఇప్పటికే మూడు రోజుల పాటు ఈడీ ఆఫీసుకు వెళుతున్నారు. విచారణకు హాజరై వస్తున్నారు.
గాంధీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది సామ్నా(Shiv Sena Saamana). ఈడీ ప్రశ్నించడాన్ని తప్పు పట్టింది. దీనికి కారణమైన కేంద్రాన్ని నిలదీసింది. ఇది కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీని ప్రశ్నించడం ద్వారా బీజేపీ ఎవరి కాలర్ అయినా పట్టు కోగలదని చూపించేందుకు ప్రయత్నం చేస్తోందంటూ ధ్వజమెత్తింది. దీనిని అధికార దురహంకారానికి పరాకాష్ట అంటూ మండిపడింది.
Also Read : కేరళ సీఎంపై స్వప్న షాకింగ్ కామెంట్స్