Shiv Sena Warns : హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని శివసేన తన మౌత్‌పీస్ సామ్నాలో దుయ్యబట్టింది. సావర్కర్ బానిసత్వానికి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయనను అవమానిస్తే సహించబోమని పార్టీ గుర్తు చేసింది.
రాహుల్ గాంధీ పదే పదే ‘నా పేరు సావర్కర్ కాదు’ అంటూ ప్రకటనలు ఇస్తున్నారని, అయితే అలాంటి ప్రకటనలు ఇవ్వడం వల్ల ధైర్యంగా ఉండరు లేదా సావర్కర్‌పై ప్రజలకున్న నమ్మకం పోదు’ అని పేర్కొంది.
శివ సేన(Shiv Sena Warns) మహా వికాస్ అఘాడి (MVA)లో భాగమైనప్పటికీ, వీర్ సావర్కర్ పై అటువంటి అవమానకరమైన అభిప్రాయాలను తీసుకోబోమని ఉద్దవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేసారు .
కాగా .. శివసేన , కాంగ్రెస్ మరియు NCP మహారాష్ట్రలో MVA కూటమిలో భాగంగా ఉన్నాయి. కానీ రాహుల్ సావర్కర్ పై ప్రకటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చింది.
Also Read : రాహుల్ గాంధీ “ఎప్పటికీ సావర్కర్ కాలేరు – అనురాగ్