Uddhav Thackeray : ద్రౌప‌ది ముర్ముకు శివ‌సేన మ‌ద్ద‌తు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ సీఎం

Uddhav Thackeray : ఇది ఊహించ‌ని ప‌రిణామం. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌లో కీల‌క మార్పు. ఇప్ప‌టి వ‌ర‌కు విప‌క్షాల‌తో క‌లిసి కేంద్రంపై యుద్దం ప్ర‌క‌టించి ప‌ద‌వి కోల్పోయిన శివ‌సేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

మంగ‌ళ‌వారం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న ద్రౌప‌ది ముర్ముకు బేష‌ర‌త్తుగా మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలో విప‌క్షాల ఆధ్వ‌ర్యంలో పాల్గొంది శివ‌సేన పార్టీ. పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేకు బ‌దులు ఆ పార్టీ త‌ర‌పున జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ పాల్గొన్నారు.

విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. కానీ ఉన్న‌ట్టుండి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.

ఇదిలా ఉండ‌గా మొత్తం శివ‌సేన పార్టీకి మొత్తం 19 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలు లోక్ స‌భ స‌భ్యులు కాగా ముగ్గురు రాజ్య‌స‌భ ఎంపీలు ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా కీల‌క స‌మావేశం చేప‌ట్టారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray). ఈ సంద‌ర్భంగా శివ‌సేన ఎంపీలు మూకుమ్మ‌డిగా ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఉద్ద‌వ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

మంగ‌ళ‌వారం జాతీయ మీడియా ఏఎన్ఐ తో మాట్లాడుతూ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఉద్ద‌వ్ ఠాక్రే చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

మ‌రో వైపు కాంగ్రెస్ , ఎన్సీపీ తో క‌లిసి శివ‌సేన మ‌హా వికాస్ అఘాడీగా ఏర్ప‌డి ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. శివ‌సేన నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయ‌డంతో ప‌డి పోయింది.

షిండే బీజేపీతో క‌లిసి ఏకంగా సీఎం అయ్యాడు. స‌ర్కార్ ను ఏర్పాటు చేశాడు.

Also Read : ద్రౌప‌ది ముర్ముకు ఘ‌న స్వాగ‌తం

Leave A Reply

Your Email Id will not be published!